కడెం నీటి నిలిపివేతపై రోడ్డెక్ కి భగ్గుమన్న జన్నారం రైతులు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

కడెం ప్రాజెక్టు పరిధిలోని రైతుల పొలాలకు సాగునీటి విడుదలను నిలిపివేయకుండా కొనసాగించాలని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. పంటలు చేతికి వచ్చే వరకు సాగునీటిని అందించాలని కోరుతూ వారు గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సాగునీటి విడుదలను ఆపడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.