మహిళా సిబ్బంది తొలగింపు వివాదం: పారిస్‌లో ఈఫిల్ టవర్ పునఃప్రారంభం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ మళ్లీ తెరుచుకుంది. హిందూ ఆధ్యాత్మిక ప్రతినిధి బృందం పర్యటన సమయంలో మహిళా ఉద్యోగులను పక్కకు వెళ్లాలని కోరడంపై సిబ్బంది సమ్మె చేపట్టడంతో టవర్‌ను ఒక రోజు మూసివేశారు. ఈ ఘటనపై వివాదం చెలరేగగా, నిర్వాహక సంస్థ స్పందించి క్షమాపణలు కోరింది. ప్రస్తుతం పర్యాటకుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.