ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోండి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆత్మకూరు

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆత్మకూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. గంగాధర్ ప్రజలకు సూచించారు. ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని ప్రజలకు ఆయన ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు పొందాలని, విద్యుత్ మరియు అగ్నిమాపక భద్రతా చర్యలు పాటించాలని స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి లేదని, ఎలాంటి వివాదాలకు తావులేకుండా పండుగను జరుపుకోవాలని కోరారు.