ఆటోమొబైల్ రంగంలో సరికొత్త రికార్డు: ఒక్క నెలలోనే ఐదు లక్షల కార్ల విక్రయాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
భారత ఆటోమొబైల్ రంగంలో అక్టోబర్ నెలలో సరికొత్త రికార్డు నమోదైందని, దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాలు తొలిసారిగా ఒకే నెలలో ఐదు లక్షల యూనిట్ల మార్కును దాటాయని ఆటోమొబైల్ నిపుణులు తెలిపారు. పండుగ సీజన్ డిమాండ్ తో పాటు పన్ను ప్రయోజనాలు విక్రయాలకు ఊతమిచ్చాయని, మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిలవగా ఇతర కంపెనీలు కూడా భారీ వృద్ధిని సాధించాయని విశ్లేషకులు వెల్లడించారు.