మలేషియాలో అట్టహాసంగా షటిల్ స్మాష్ టోర్నమెంట్: ఘనంగా ముగిసిన ఆటలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కౌలాలంపూర్

తెలుగు ఎక్స్పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కౌలాలంపూర్ లో విజయవంతంగా ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. అధ్యక్షులు అనిల్ కుమార్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ పోటీల్ లో రెండొందలకు పైగా జట్లు, రెండు వందల పదిహేను మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్ లో విజేతలకు ముఖ్య అతిథులు ట్రోఫీలు అందజేశారు. మలేషియాలోని తెలుగు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదపడింది.