ఐఐటీ జామ్ 2027 ప్రకటన విడుదల, సెప్టెంబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్లు

రిపోర్టర్: కిరణ్ స్థలం: భారతదేశం

ఐఐటీ జామ్ 2027 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 12 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. మార్చి 18న ఫలితాలు వెలువడనున్నాయి. ఎలాంటి వయోపరిమితి లేకుండా అర్హత ఉన్న దేశవిదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.