ఆరోగ్యానికి సంగీతం దివ్యౌషధం: సంగీతం ఆయువును పెంచుతుందన్న బ్రియాన్ జాన్సన్

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

సంగీతం వినడం వల్ల ఒత్తిడి తగ్గి ఆయుష్షు పెరుగుతుందని ప్రముఖ టెక్ వెంచర్ క్యాపిటలిస్ట్ బ్రియాన్ జాన్సన్ తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం ఇష్టమైన పాటలు వినాలని ఆయన సూచించారు. గుండె స్పందన రేటు, రక్తపోటు, కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రీయ అధ్యయనాలను ఉటంకిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇష్టమైన పాటలతో కూడిన సంగీత చికిత్స ఒత్తిడిని దూరం చేస్తుందని వివరించారు.