ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం: మల్లయ్య యాదవ్
రిపోర్టర్: అశోక్
స్థలం: సూర్యాపేట
కోదాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన ర్యాలీ జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మండిపడ్డారు. గురుకులాల్లో నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కమీషన్ల కోసం మంత్రులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు.