విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు

రిపోర్టర్: హరి స్థలం: విజయవాడ

వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజల్లో పేదరికం తొలగిపోవాలని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలానక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అందరికీ ఆనందం, ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బందిని ఆయన అభినందించారు.