కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదాస్పద కావేరీ నది జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కర్ణాటకకు 70 టీఎంసీలు అదనంగా కేటాయించాలన్న రిట్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రైవేట్ సొసైటీల పిటిషన్లు చెల్లవని, అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో థర్డ్ పార్టీలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది.