విజయనగరం జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
విజయనగరం కంటోన్మెంట్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులచేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు. పంతొమ్మిదేళ్ల లోపు బాలబాలికలందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ఈ మాత్రలను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. వీటి నివారణకు ప్రతి ఆరు నెలలకోసారి అల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.