ఏపీలో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, పోలవరం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని, బయట ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది.