ఈసీ తీరును నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ధర్నా
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 30న భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న ఈ ఆందోళనలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.