గుజరాత్ జెయింట్స్ సంచలన నిర్ణయం: డానీ వ్యాట్-హాడ్జ్ జట్టు నుంచి విడుదల
రిపోర్టర్: సునీల్
స్థలం: Mumbai
మహిళల ప్రీమియర్ లీగ్ మెగా టోర్నీకి సంబంధించి గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన కోచ్ మైఖేల్ క్లింగర్ తెలిపారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ డానీ వ్యాట్-హాడ్జ్ను వేలానికి వదిలేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్లలో ఆడే అవకాశం రాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లింగర్ వెల్లడించారు. అలాగే గాయాల కారణంగా భారత పేసర్ తిటాస్ సాధును కూడా విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.