విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో ఉగ్ర మూలాల కేసు ఛార్జిషీట్ దాఖలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయవాడ

ఉగ్ర మూలాల కేసులో జాతీయ దర్యాప్తు ఏజెన్సీ విజయవాడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో 9 మంది నిందితులపై శుక్రవారం ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఐసిస్‌లో సభ్యులుగా చేరి, సోషల్ మీడియా ద్వారా కార్యకలాపాలు విస్తరించేందుకు కుట్ర పన్నారన్న అభియోగాలతో ఈ ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.