మంగళగిరిలో మహిళల టీ-20 క్రికెట్ డబ్ల్యూఏపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: Mangalagiri

మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ డబ్ల్యూఏపీఎల్ టీ-20 తొలి సీజన్ ఘనంగా ప్రారంభమైంది. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరై ఈ టోర్నమెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీలో నారా బ్రాహ్మణి, మిథాలీరాజ్‌లు కలిసి డబ్ల్యూఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో నాలుగు జట్లు తలపడనున్నాయి.