ఇందిరాపార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా: భారీగా తరలిరావాలని గౌతమ్ గౌడ్ పిలుపు

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

ట్యాంక్ బండ్ ఇందిరాపార్క్ వద్ద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు హఫీజ్‌పేట్, మదీనాగూడ డివిజన్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ నేత బల్లింగ్ గౌతమ్ గౌడ్ పిలుపునిచ్చారు. అందరూ హఫీజ్‌పేట్ పార్టీ కార్యాలయానికి చేరుకుని, అక్కడి నుంచి కలిసికట్టుగా ధర్నా స్థలానికి బయలుదేరాలని ఆయన కోరారు.