అనంతపురంలో నీటి క్యాన్ ట్యాప్ తిప్పి దాహం తీర్చుకున్న కోతి
రిపోర్టర్: సతీష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దాహంతో అల్లాడిపోయిన కోతి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎక్కడా నీరు దొరకకపోవడంతో నేరుగా వాటర్ క్యాన్ దగ్గరకు వెళ్లి ట్యాప్ తిప్పుకుని ఎంచక్కా దాహం తీర్చుకుంది. ఫ్లోర్ మీద పడిన నీటిని కూడా తాగి తన తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వానరం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.