భారత్ లో కృత్రిమ మేధ వినియోగం అద్భుతం: సామ్ ఆల్ట్మాన్ ప్రశంసలు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

అమెరికా కంటే భారత్లోనే కృత్రిమ మేధ వినియోగం అత్యంత వేగంగా పెరుగుతోందని ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మాన్ తెలిపారు. ప్రముఖ పాడ్కాస్ట్ నిర్వాహకుడు రాజ్ షమానితో మాట్లాడుతూ, భారత్ లో అద్భుతమైన బిల్డర్ ఎనర్జీ ఉందని, చాట్జీపీటీకి ఇది అతిపెద్ద మార్కెట్ అని ఆయన వెల్లడించారు. ఆర్థిక అభివృద్ధి వేగంగా ఉన్న దేశాలు కొత్త సాంకేతికతను ఎక్కువగా స్వాగతిస్తున్నాయని, భారత్ ఈ విషయంలో ఎంతో సానుకూలంగా ఉందని ఆల్ట్మాన్ పేర్కొన్నారు.