రాష్ట్రంలో నాలుగు ప్యాకేజీలుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం

రిపోర్టర్: సురేష్ స్థలం: Amaravati

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని నాలుగు ప్యాకేజీలుగా చేపట్టనున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు. మొత్తం 195.13 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఈ ప్రాజెక్టును రూ.30,491 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో సివిల్ పనుల కోసం రూ.10,595.70 కోట్లు, భూసేకరణకు రూ.5,315 కోట్లు వెచ్చించనున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణానదిపై రెండు భారీ వంతెనలు, మూడు సొరంగాల నిర్మాణాలను ఈ ప్యాకేజీల్లో పూర్తి చేయనున్నారు.