ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటానంటూ దానం నాగేందర్ సవాల్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్.. న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామని, నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ తన వెంటే ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.