రూపాయలు పదిహేను వందలకే జియోభారత్ ఫోన్ మరియు ఆరు నెలల రీఛార్జ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: భారతదేశం

భారతదేశంలో పదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జియో సంస్థ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించినట్లు టెలికాం వర్గాలు వెల్లడించాయి. రూ.1,499 ధరకే జియోభారత్ ఫోన్తో పాటు ఆరు నెలల పాటు ఉచిత కనెక్టివిటీ ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపాయి. రెండు జీ నెట్వర్క్ వినియోగదారులను నాలుగు జీ వైపునకు మార్చడమే లక్ష్యంగా ఈ ఆఫర్ను తెచ్చినట్లు పేర్కొన్నాయి. దీని ద్వారా ప్రతి నెలా 14 జీబీ డేటా లభిస్తుందని, రూ.299కే ఈ హ్యాండ్సెట్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వివరించాయి.