ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ప్రమాదంలో ఒక నవజాత శిశువు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, వార్డులో ఉన్న 20 మందికి పైగా చిన్నారులు ప్రభావితమయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద బారిన పడి చికిత్స పొందుతున్న ఆ పసిపిల్లలందరూ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.