నీటిపై బైకుతో సంచలనం: గిన్నిస్ రికార్డు సృష్టించిన చైనా సాహసికుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: Beijing

నీటిపై మోటార్ సైకిల్ తో ప్రయాణించి చైనాకు చెందిన సాహసికుడు జాంగ్ జ్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించినట్లు జిన్హువా మీడియా వెల్లడించింది. సుమారు పదిహేడు సంవత్సరాల క్రితం తన మొదటి ప్రయత్నంలో విఫలమైన ఆయన, తాజాగా మార్పులు చేసిన ప్రత్యేక బైకుతో నలభై కిలోమీటర్లకు పైగా దూరం విజయవంతంగా ప్రయాణించారు. దీనిని గిన్నిస్ ప్రతినిధులు అధికారికంగా ధ్రువీకరించారు.