రాజుపేటలో ఘనంగా మరిడమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: గొలుగొండ

గొలుగొండ మండలం కొత్త యల్లవరం పంచాయతీ రాజుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మరిడమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జెడ్పీటీసీ సుర్ల వెంకట గిరిబాబు, మాజీ పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.