వరద ప్రవాహంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీకాకుళం
ఉత్తరాంధ్రపై వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. ఆయనతో పాటు కలెక్టర్, ఎస్పీ కూడా ప్రవాహంలో చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై మరో బోటులో వెళ్లి వారిని రక్షించారని అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, గర్భిణీలను సురక్షితంగా ఆస్పత్రులకు తరలించామని తెలిపారు.