'విద్యార్థుల మృతి తీవ్రంగా కలచివేసింది': మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

రిపోర్టర్: శివ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు నేరేడు చెరువులో ప్రమాదవశాత్తూ పడి మృత్యువాత పడ్డారు. మృతులను నరసింహ, తేజ, సిద్దార్థ, గణేశ్‌, సుమంత్‌రెడ్డి, ఉదయ్‌ కిరణ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.