దేశమంతా ఒక సిస్టమ్ చేతిలో బందీగా ఉందంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: ఇందౌర్
దేశమంతా ఒక సిస్టమ్ చేతిలో బందీగా ఉందని, విద్యార్థులు ప్రశ్నలు అడగడం ఆ వ్యవస్థకు ఇష్టం లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్ లోని ఇందౌర్‌లో నిర్వహించిన ఛాత్రోం కీ గూంజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి నిరంతరం ప్రశ్నలు అడుగుతాడని, అంధభక్తుడు ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఊహా ప్రపంచంలో బతుకుతాడని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.