చిత్తూరు మేయర్ ఎన్నికల పోరు: కూటమి దూకుడుతో డీలా పడ్డ వైకాపా

రిపోర్టర్: రాము స్థలం: చిత్తూరు

చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థులు ముమ్మర ప్రచారంతో దూసుకెళ్తున్నారు. మొత్తం అరవై డివిజన్లలో యాభై స్థానాలు కూటమికి ఏకగ్రీమం కావడం వైకాపా శ్రేణులను డీలా పడేలా చేసింది. తెదేపా తరఫున బరిలో ఉన్న కఠారి హేమలతకు నగర ప్రజల్లో ఉన్న మంచి పేరు, ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి విజయావకాశాలను ద్విగుణీకృతం చేస్తున్నాయి. వైకాపా నామమాత్ర పోటీకే పరిమితమైనప్పటికీ అర్థబలాన్ని నమ్ముకుని ఎన్నికల బరిలో నిలిచింది.