అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన పెందుర్తి క్రీడాకారిణి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పెందుర్తి
పెందుర్తి మండలం, గొరపల్లి గ్రామానికి చెందిన విజయతేజస్విని అండర్-17 అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైంది. చైనాలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనేందుకు ఆమె సిద్ధమవుతోంది.
క్రీడాకారిణి ప్రతిభను గుర్తించిన జనసేన జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సాయంపై అర్జీల్లి అప్పలరాజు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.