విశాఖలో కార్డన్ అండ్ సెర్చ్: ఏడు అక్రమ వాహనాలు సీజ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణే లక్ష్యంగా కంచరపాలెం మరియు పద్మనాభం పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు VizagCityPolice వెల్లడించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతి ఇంటిని, షాపులను నిశితంగా పరిశీలించామని పేర్కొన్నారు. సరియైన ధ్రువపత్రాలు లేని ఏడు వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, నగరంలో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.