బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. మహిళా నేతలకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.