ఆసియా చాంపియన్స్ ట్రోఫీ: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఒలింపియన్ సుర్జిత్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పదమూడు సున్నా తేడాతో చిత్తు చేసి భారత్ అదరగొట్టిందని నిర్వాహకులు తెలిపారు. మన్దీప్ సింగ్ హ్యాట్రిక్ సాధించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్ తలా రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.