భారత తొలి బుల్లెట్ రైలు తయారీ: కీలక అప్డేట్ ఇచ్చిన రైల్వే శాఖ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మొట్టమొదటి బుల్లెట్ రైలు తయారీ పనులకు సంబంధించి తాజా వివరాలను వెల్లడిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. భారత్ తొలి బుల్లెట్ రైలు నిర్మాణానికి సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలు త్వరలోనే అద్భుతమైన ప్రయాణ అనుభూతిని పొందనున్నారని ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటూ స్పష్టం చేసింది.