యూపీఐ లావాదేవీలపై పన్నులు అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దన్న నిర్మలా సీతారామన్

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా పన్నులు, సెస్సులు విధిస్తోందంటూ నెట్టింట వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ తరహా పుకార్లను నమ్మవద్దని, సామాన్యుల డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి అదనపు రుసుముల భారం పడబోదని ఆమె స్పష్టం చేశారు. పర్సన్-టు-పర్సన్ లావాదేవీలన్నీ మునుపటిలాగే రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని తేల్చి చెప్పారు.