కారాగారంలో నైజీరియన్‌ మహిళలు వేధిస్తున్నారంటూ కోర్టులో పవిత్రా గౌడ కన్నీరు

రిపోర్టర్: నరేష్ స్థలం: బెంగళూరు

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలైన నటి పవిత్రా గౌడ బెంగళూరు 59వ సీసీహెచ్‌ కోర్టులో వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణకు హాజరయ్యారు. కారాగారంలో నైజీరియన్‌ మహిళలు తనను వేధిస్తున్నారని, తనకు బెయిలు ఇవ్వాలని లేదా చనిపోయేందుకు విషం ఇవ్వాలని ఆమె న్యాయమూర్తిని వేడుకుంటూ కన్నీరు కార్చారు. పవిత్రను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తరఫు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేయగా, కోర్టు ఆదేశాలతో ఆమెను ఇప్పటికే మరో బ్యారక్‌కు మార్చామని సిట్ తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు.