బంగారు ఆభరణాల హాల్ మార్కింగ్ ఫీజు భారీగా పెంపు
రిపోర్టర్: రాము
స్థలం: India
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బంగారు ఆభరణాల హాల్మార్కింగ్ ఫీజును భారీగా పెంచింది. ఇప్పటివరకు ఒక్కో ఆభరణానికి రూ.45గా ఉన్న ఫీజును రూ.75కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు ఇప్పటికే అమల్లోకి రాగా, పండుగలు పెళ్లిళ్ల సీజన్ వేళ కొనుగోలుదారులపై ఈ భారం పడనుంది.