హైదరాబాద్ బాపూఘాట్‌లో గాంధీ జయంతి ఏర్పాట్లపై అధికారులతో డీఆర్వో సమీక్ష

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ బాపూఘాట్‌లో నిర్వహించనున్న మహాత్మా గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ నారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్డీవో రామకృష్ణ, పోలీసు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి సహా వీఐపీలు పాల్గొనే ఈ వేడుకల్లో విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు, బందోబస్తు తదితర ఏర్పాట్లను సమన్వయంతో విజయవంతం చేయాలని ఆయన సూచించారు.