మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ: నేడు ఏపీలో ఓట్ల లెక్కింపు

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదమూడు మున్సిపల్ కార్పొరేషన్లు మరియు డెబ్బై తొమ్మిది మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ నవంబర్ మూడవ తేదీన ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల ద్వారా పట్టణ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనే అంశంపై రాజకీయ పార్టీల్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.