ఆశల పందిరి కూలి కన్నీటి సంద్రమైన అన్నదాత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో వరి పంటకు ఆకు ఎండు తెగులు సోకడంతో పంట ఎండిపోతుండడంపై రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టి కష్టపడి సాగు చేసిన పంట కళ్లెదుటే నశించిపోతుండడంతో కంటతడి పెడుతున్నారు. సంబంధిత వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి పొలాలను పరిశీలించి, తగిన సలహాలు, సూచనలు అందించి నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.