'దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి': రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ జరిగిన భూ కుంభకోణాలు, ధరణి, భూభారతి అవకతవకలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తుల పెంపుపై కూడా సమగ్ర విచారణకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.