ముంబైలో భారీ వాణిజ్య ఆస్తిని లీజుకు ఇచ్చిన ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్
రిపోర్టర్: రాజేష్
స్థలం: మహారాష్ట్ర
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ రోషన్ ముంబైలోని అంధేరి వెస్ట్‌లో భారీ వాణిజ్య ఆస్తిని లీజుకు ఇచ్చారు. బీయింగ్‌యూ స్టూడియోస్‌కు రెండు ఆఫీసు యూనిట్లను మూడేళ్ల కాలానికి కేటాయించారు. తొలి నెల అద్దె రూ. 7.3 లక్షలుగా నిర్ణయించగా, ప్రతి ఏటా 5 శాతం అద్దె పెరిగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా మూడేళ్లలో రూ. 2.76 కోట్ల ఆదాయం సమకూరనుంది.