పెద్దపల్లిలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు: రైతులకు ప్రభుత్వ విప్ విజయ రమణారావు పిలుపు

రిపోర్టర్: సునీల్ స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో పాక్స్ ఆధ్వర్యంలో నిర్మించిన సోలార్ ప్లాంట్ను ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. అనంతరం మరో ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వ విప్ సూచించారు.