మహాకవి గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఏటా సెప్టెంబర్‌ 21వ తేదీన ఆయన జయంతిని ఉత్సవంగా నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాహితీ, సామాజిక, సాంస్కృతిక రంగాలకు ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్రస్థాయి వేడుకలను విజయనగరం జిల్లాలో నిర్వహించనున్నారు.