సమాజ సంక్షేమమే లక్ష్యంగా పోలీసుల నిరంతర సేవలంటూ సీపీ ప్రశంస
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
కుటుంబ సంక్షేమం కంటే సమాజ సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తూ పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంచిర్యాలలో ముప్పై ఏడేళ్ల పాటు సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్ఐ మొహాద్ అబ్దుల్ జలీల్‌ను శనివారం ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం విరమణ తర్వాత కుటుంబంతో గడపాలని సూచించారు.