రాజాపేటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణుని జన్మదిన విశిష్టతను భక్తులకు వివరించారు.

సాయంత్రం చిన్నారి గోప గోపికల సామూహిక నృత్య ప్రదర్శనలు, బాలకృష్ణునికి పంచామృత అభిషేకాలు, నవనీత నైవేద్యం, డోలోత్సవం ఘనంగా జరిగాయి. దాతల సహకారంతో గోప గోపికల వేషధారణలో వచ్చిన పిల్లలకు ప్రత్యేక బహుమతులు అందజేసి, భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.