ఆరోగ్యానికి భారీ ఊరట: కొలెస్ట్రాల్ను సమర్థంగా తగ్గించే బ్యాక్టీరియాను గుర్తించిన శాస్త్రవేత్తలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఒక ప్రత్యేక బ్యాక్టీరియా అద్భుతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని నేచర్ పత్రిక వెల్లడించింది. బాక్టీరియిడ్స్ యూనిఫార్మస్ అనే ఈ బ్యాక్టీరియా విడుదల చేసే అణువు కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకోవడంతో పాటు ధమనులలో కొవ్వు ఫలకాలను తగ్గిస్తుందని ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో స్పష్టమైందని పరిశోధకులు తెలిపారు. అయితే మానవులపై ఈ బ్యాక్టీరియా ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.