టేకులపల్లిలో విషపురుగు కాటుకు చిన్నారి మృతిపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం టేకులపల్లి డివిజన్లో అంగన్వాడీ కేంద్రానికి చెందిన ఐదేళ్ల చిన్నారి విషపురుగు కాటుకు బలవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు బ్రిడ్జి వద్ద ధర్నా నిర్వహించి అధికారులను డిమాండ్ చేశారు.