నాగిరెడ్డిపల్లిలో లబ్ధిదారులకు నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రిపోర్టర్: SARA ASHOK
స్థలం: నవాబ్‌పేట
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. నవాబుపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.