చిన్నారుల చేతుల మీదుగా సిద్ధార్థ నగర్ లో వినాయక ప్రతిష్ట

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని 87వ వార్డు సిద్ధార్థ నగర్ కాలనీలో చిన్నారులు తమ హుండీ దాచుకున్న సొమ్ముతో వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేశారు. తమ సామర్థ్యం మేరకు పూజా, డెకరేషన్ సామాగ్రి సమకూర్చి విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం రెండు కిలోల లడ్డు ప్రసాదానికి వేలంపాట నిర్వహిస్తామని పిల్లలు తెలిపారు. కాలనీ పెద్దలు బలిరెడ్డి నాగేశ్వర రావు, గణపతి మాస్టర్, సత్యనారాయణ, మోహన్ రావు, లక్ష్మి తదితరులు చిన్నారుల స్ఫూర్తిని ప్రశంసించి అభినందించారు.